: వారం రోజుల పాటు చారిత్రక కట్టడాల వద్ద నో సెల్ఫీస్


దేశంలోని చారిత్రక కట్టడాల వద్ద సెల్ఫీలు తీసుకోవడంపై వారం రోజుల పాటు నిషేధం విధించారు. స్వాతంత్ర్య దినోత్సవం, భారత్ పర్వ్ వేడుకల దృష్ట్యా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత పర్యాటక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేధిస్తూ ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందనే అనుమానాల నేపథ్యంలో చారిత్రక, ముఖ్య కట్టడాల సందర్శన నిమిత్తం వచ్చే విజిటర్లకు పరిమితులు విధించాలని భారత పర్యాటక, పురావస్తు సర్వే విభాగాలకు పోలీసులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

  • Loading...

More Telugu News