: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతం.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
వచ్చే విజయదశమి రోజునే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని భావిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేస్తోంది. సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ ఆధ్వర్యంలో ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్తజిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వారంలోగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉపసంఘం నివేదిక ఇవ్వనుంది. జిల్లాల సంఖ్య, జిల్లాలు వెంటనే కార్యాచరణలోకి రావడానికి చేయాల్సిన తాత్కాలిక ఏర్పాట్లను గురించి ఉపసంఘం అధ్యయనం చేస్తుంది. కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, కార్యాలయాల కల్పన గురించి నివేదిక ఇవ్వనుంది. అధ్యయనం పూర్తి చేసిన తరువాత ఉద్యోగుల కేటాయింపులకు మార్గ దర్శకాలు, జోనల్ సిస్టంపై సూచనలు చేయనుంది. జిల్లాలో ప్రభుత్వ శాఖల పునర్విభజనపై విస్తృత మార్గదర్శకాలు ఇవ్వనుంది.