: ఎస్సీ వర్గీకరణ డిమాండ్ సహేతుకమైనదే!... వెంకయ్య కీలక వ్యాఖ్య!


ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఏర్పాటైన ఉద్యమ సంస్థ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్)కి కేంద్రంలోని అధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఢిల్లీలో కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ మహా ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సందర్భంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ సహేతుకమైనదేనని ఆయన పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను వర్గీకరిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను వర్గీకరిస్తే ఎలాంటి నష్టం కూడా లేదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News