: నయీమ్ బెడ్ రూంలో 10 డైరీలు!... శాటిలైట్ ఫోన్ కూడా వాడినట్లు ఆధారాలు!


గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించిన ఒక్క డైరీ వెలుగులోకి వస్తేనే... పోలీసు బాసులతో పాటు రాజకీయ నేతలు, జర్నలిస్టుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా అలకాపురిలోని నయీమ్ ఇంటి రెండో అంతస్తులో ఉన్న అతడి బెడ్ రూం తలుపులు బద్దలుకొట్టిన పోలీసులు, సోదాల్లో భాగంగా ఏకంగా 10 డైరీలను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతితో కొద్దిసేపటి క్రితం రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్న ఏసీపీ గంగిరెడ్డి నయీమ్ బెడ్ రూం తలుపులు బద్దలు కొట్టారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల సమక్షంలోనే సోదాలు చేసిన పోలీసులు 10 డైరీలను కనుగొన్నారు. ఇక ఎన్ కౌంటర్ కు ముందు రోజు నయీమ్ శాటిలైట్ ఫోన్ వినియోగించినట్లు కూడా అక్కడ ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. సదరు శాటిలైట్ ఫోన్ ద్వారా అతడు ఓ పోలీసు అధికారితో సుదీర్ఘంగా మాట్లాడినట్లు పోలీసులకు పక్కా ఆధారాలు దొరికాయన్న విషయం పోలీసు వర్గాల్లో పెను కలకలమే రేపుతోంది.

  • Loading...

More Telugu News