: జూబ్లీహిల్స్ లో వెంకన్న సన్నిధి!... ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చదలవాడ!
భాగ్యనగరి హైదరాబాదు వాసులకు తిరుమల వెంకన్న మరింత చేరువ కానున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్ లో కొత్తగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కాబోతోంది. ఏడాదిలోగానే ఈ ఆలయం నగర వాసులకు అందుబాటులోకి రానుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం:92లో 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.28 కోట్లు కేటాయించింది. ఈ ఆలయ నిర్మాణ పనులను టీడీపీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కొద్దిసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది వ్యవధిలోగానే ఆలయ నిర్మాణం పూర్తి కానున్నట్లు ప్రకటించారు.