: బాలీవుడ్ సినిమాలే కాక హాలీవుడ్‌లోనూ ప‌లు అవ‌కాశాలు వ‌దులుకున్నా: ప్రియాంక చోప్రా


హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా.. ‘బేవాచ్‌’ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా మారిపోయిన విష‌యం తెలిసిందే. ఆమె అమెరిక‌న్ టీవీ సీరియ‌ల్‌ ‘క్వాంటికో’ షూటింగ్‌లోనూ పాల్గొంటోంది. బాలీవుడ్‌లో చివ‌ర‌గా ‘గంగాజల్‌-2’ సినిమాలో క‌నిపించిన ఈ అమ్మ‌డు మ‌ళ్లీ బాలీవుడ్ వైపుకి తిరిగి చూడ‌క‌పోతుండ‌డంతో ఇక ప్రియాంక బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుందా? లేదా? అనే అంశంపై అభిమానుల్లో సందిగ్ధ‌త నెల‌కొంది. దీనిపై ప్రియాంక తాజాగా స్పందిస్తూ.. త‌న షెడ్యూల్‌లో వ‌చ్చే ఏడాది మార్చి వరకు ఖాళీ లేద‌ని తెలిపింది. ‘క్వాంటికో’తో తాను ఒప్పందం చేసుకుంది క‌నుక తాను ఆ సీరియ‌ల్ రెండో సీజన్‌లోనూ నటిస్తున్నాన‌ని చెప్పింది. అంతేకాదు, ఆ సీరియ‌ల్‌ మూడో సీజన్‌ కూడా వస్తే దానిలోనూ న‌టించాల్సి వ‌స్తుందేమోన‌ని పేర్కొంది. క్వాంటికోను ప్రపంచ వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో వీక్షిస్తున్నారని, దానిలో నటించడం త‌న‌కు మంచి అవకాశమే కదా? అని ప్ర‌శ్నించింది. తాను బాలీవుడ్ సినిమాలే కాక హాలీవుడ్‌లోనూ ప‌లు అవ‌కాశాలు వ‌దులుకున్నాన‌ని చెప్పింది. తాను కాలంతో పోటీపడి పని చేస్తున్నట్లు ప్రియాంక వ్యాఖ్యానించింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో తాను సంవత్స‌రానికి ఒక్క సినిమాలో న‌టించాల‌ని అనుకుంటున్న‌ట్లు ఈ అమ్మ‌డు చెప్పింది. మంచి సినిమాల్ని ఎంచుకునే క్ర‌మంలో ఈ జాగ్ర‌త తీసుకుంటున్న‌ట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News