: వైఎస్ జగన్ జిల్లాలో ముద్రగడ!... కొత్త చర్చకు తెర లేపిన కాపు నేత కడప పర్యటన!


కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న ఉన్నట్టుండి కడపలో ప్రత్యక్షమయ్యారు. విమానంలో కడప చేరుకున్న ముద్రగడకు ఎయిర్ పోర్టులోనే జిల్లాకు చెందిన కాపు నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కడపకు చెందిన కాపు నేత, న్యాయవాది గురప్ప ఇంటిలో విందారగించిన ఆయన నగరంలోని పలువురు కాపుల ఇళ్లకు వెళ్లారు. అక్కడ ఆయన కాపులతో గంటల తరబడి చర్చలు జరిపారు. ఆ తర్వాత కాపు నేతలను వెంటబెట్టుకుని పెద్ద దర్గా, విజయదుర్గమ్మ గుడిలో పూజలు చేశారు. నగరంలోని కృష్ణా సర్కిల్ లోని శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ముద్రగడ ఆకస్మిక పర్యటనపై ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది.

  • Loading...

More Telugu News