: పట్టిసీమ గండి పూడ్చివేత!... కృష్ణా నదికి గోదారి జలాల విడుదల!


గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ఏపీ సర్కారు కట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు పడిన గండిని అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. రాత్రింబవళ్లు పనిచేసినా... పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని రామిలేరు సమీపంలో పోలవరం కుడికాలువకు పడిన సదరు గండిని పూడ్చివేసేందుకు ఏకంగా 9 రోజుల సమయం పట్టింది. ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాత్రింబవళ్లు అక్కడే తిష్ట వేసి పనులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో నిన్న గండి పూడ్చివేత పనులు పూర్తి కాగానే పట్టిసీమ మోటార్లను అధికారులు ఆన్ చేశారు. వెరసి దాదాపు 9 రోజుల తర్వాత గోదావరి జలాలు తిరిగి కృష్ణా నదిలోకి ప్రవహించడం ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News