: ఢిల్లీకి వెళుతున్న తుమ్మల!... కేంద్ర మంత్రి గడ్కరీతో నేడు కీలక భేటీ!
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కోసమే తుమ్మల ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణలో రహదారులకు సంబంధించి కొత్త ప్రాజెక్టులపై జరగనున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడనున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ముగిసిన మూడు రోజులకే ఈ భేటీ జరుగుతుండటంపై కూడా భారీ అంచనాలున్నాయి. తెలంగాణలో రహదారులకు సంబంధించి కేంద్రం భారీ ప్రాజెక్టును ప్రకటించే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.