: హోదాపై రాజ్యసభను తప్పుదోవ పట్టించారు... జైట్లీపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం: జైరాం రమేష్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వివరణ ఇచ్చే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. ఈ అంశంపై తాము జైట్లీపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని పేర్కొన్నారు. రాజ్యసభలో హోదాపై వివరణ ఇస్తూ ప్రత్యేకహోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని చెప్పారని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. సభలో జైట్లీ ఉత్తరాఖండ్‌కు హోదా ఇచ్చేందుకు ఎన్డీసీ ఆమోదం ఇచ్చిందనటం కూడా అసత్యమని జైరాం రమేష్ అన్నారు. ఈ అంశాలపైనే తాము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఏపీకి హోదా ఇవ్వక్కర్లేదని జైట్లీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని జైరాం రమేష్ ఆరోపించారు.