: ఈనెల 12న గొందిమల్లలో సీఎం కేసీఆర్ దంపతుల పుష్కరస్నానం
మహబూబ్‌నగర్ జిల్లా గొందిమల్లలో ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్‌లో ఈనెల 12న సీఎం కేసీఆర్ దంపతులు పుష్కర స్నానం చేయనున్నారు. అక్కడ జరుగుతోన్న కృష్ణా పుష్కరాల ఏర్పాట్లను ఈరోజు తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పుష్కర ఘాట్ల ఏర్పాట్ల పనులు 99 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా యంత్రాంగం నెలరోజుల నుంచి పనుల్లో నిమగ్నమైందని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏడు వేల మంది పోలీసులు రంగంలోకి దిగనున్నారని ఆయన పేర్కొన్నారు. ఘాట్లలో భక్తుల తాకిడి ఎక్కువయితే కొందరిని ప్రవేశ ద్వారాల ముందే ఆపి అక్కడే కొంతసేపు ఉండేలా సౌకర్యాలు కల్పించనున్నామని తెలిపారు.