: సింహాలతో సెల్ఫీ దిగిన క్రికెటర్ జడేజాకు ఫైన్


టీమిండియా క్రికెటర్ జడేజా ఇటీవల తన భార్యతో కలసి సింహాల సఫారీలోకి వెళ్లి, సింహాలతో సెల్ఫీలు దిగడాన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణించింది. రూ.20 వేల ఫైన్ విధించింది. జూన్ 14వ తేదీన గుజరాత్ గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని సింహాల సఫారీకి జడేజా దంపతులు వెళ్లారు. సింహాలతో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో జడేజా పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలపై నెటిజన్ల విమర్శలను సైతం జడేజా పట్టించుకోలేదు. పైగా, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో అటవీశాఖ జడేజాపై జరిమానా విధించింది. అయితే, ఈ సంఘటనపై విచారణ నివేదిక పెండింగ్ లో ఉండగానే అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News