: విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల్సిందే... నాగ‌పూర్‌లో ఆందోళన


ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈరోజు నాగ‌పూర్‌లో భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ప్ర‌జ‌లు చేస్తోన్న ఈ ఆందోళ‌న‌కు కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు తెలిపింది. ప్ర‌త్యేక విద‌ర్భ కోసం నినాదాలు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నివాసాన్ని ఆందోళ‌న‌కారులు ముట్టడించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రోవైపు కేంద్రం ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటు ప‌ట్ల ప్ర‌తికూల సంకేతాలు ఇచ్చింది. అయితే, ఆందోళ‌న‌కారులు త‌మ డిమాండ్‌ను సాధించుకుని తీరుతామ‌ని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News