: జ్యోతిలక్ష్మి అంత్యక్రియలు పూర్తి
చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచిన సీనియర్ సినీనటి జ్యోతిలక్ష్మి(63) అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని కన్మమ్మపేట శ్మశానవాటికలో అల్లుడు బాలాజీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిలక్ష్మి భౌతిక కాయాన్ని చూసేందుకు ప్రముఖ సినీనటులు, ఆమె అభిమానులు భారీగా వచ్చారు. 300లకు పైగా సినిమాలో నటించిన జ్యోతిలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.