: నయీమ్ అంత్యక్రియల విషయంలో భువనగిరిలో తీవ్ర ఉద్రిక్తత... పోలీసులు నచ్చజెపుతున్నా వినిపించుకోని బంధువులు
గ్యాంగ్ స్టర్ నయీమ్ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం షాద్ నగర్ నుంచి భువనగిరికి తరలించిన వేళ, తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన తరువాత అసలు సమస్య మొదలైంది. పోలీసులు అరెస్ట్ చేసిన నయీమ్ భార్యా బిడ్డలు, అక్కను తీసుకువచ్చిన తరువాతనే అంత్యక్రియలు జరిపిస్తామని బంధువులు మొండికేశారు. వారికి మద్దతుగా వేలాది మంది ముస్లింలు ఆ ప్రాంతంలో చేరి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసు అధికారులు నచ్చజెబుతున్నప్పటికీ నయీమ్ బంధువులు వినిపించుకోవడం లేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆయన భార్యను తీసుకువచ్చే పరిస్థితులు లేవని, ఆమెను రహస్యంగా విచారిస్తున్నారని భువనగిరి పోలీసులు చెబుతున్నట్టు తెలుస్తోంది.