: నాటి మలేసియన్ విమానం దుర్ఘటన: నిమిషానికి 22 వేల అడుగుల చొప్పున పడిపోతూ... సముద్రంలో కూలిన ఎంహెచ్ 370
మార్చి 8, 2014లో కౌలాలంపూర్ నుంచి 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్ లైన్స్ ఎంహెచ్ 370 విమానం నిమిషానికి 22 వేల అడుగుల వేగంతో కిందకు వస్తూ, హిందూ మహా సముద్రంలో కుప్ప కూలిందని అధికారులు తేల్చారు. విమానం పడిపోతున్న ఆఖరి క్షణాల్లో సైతం దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు జరిగి వుండవచ్చని, అందువల్ల ప్రస్తుతం సెర్చ్ చేస్తున్న ప్రాంతంలో ఆ విమానం జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఇప్పుడు సోదాలు జరుపుతున్న 1,20,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం బయట విమానం కూలి ఉండవచ్చని అధికారులు పేర్కొన్నట్టు 'ది ఆస్ట్రేలియన్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 35 వేల అడుగుల ఎత్తున విమానం ఉన్న వేళ, ఇంజన్లకు మంటలు అంటుకుని, వేగం తగ్గిపోయి కూలిపోయిందని అంచనాకు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.