: ఉపాధ్యాయురాలి ఇంట్లో రూ.30 లక్షలు, 50 తులాల బంగారం చోరీ
ఖమ్మం జిల్లా గార్ల మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఇంట్లోని రూ.30 లక్షలు, 50 తులాల బంగారం అపహరించారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చూసుకున్న దుండగులు తాళాన్ని పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఉపాధ్యాయురాలి ఇంటివద్దకు చేరుకొని చోరీపై ఆరా తీశారు. అనంతరం దుండగుల కోసం వేట ప్రారంభించినట్లు సమాచారం.