: నంది అవార్డులకు త్వరలోనే కొత్త పేరు ప్రకటిస్తాం: మంత్రి తలసాని
తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించి ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డుల స్థానంలో త్వరలోనే కొత్త పేరును ప్రకటిస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్షించారు. చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తామని, అన్ని థియేటర్లలోనూ ఐదో ప్రదర్శనగా చిన్న సినిమాలకు అనుమతిస్తామని చెప్పిన తలసాని, 200 సీట్ల సామర్థ్యంతో మినీ థియేటర్లకు త్వరలోనే అనుమతిస్తామని తెలిపారు.