: నిర్వాసితుల కోసం రేపు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్ష
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి రేపు ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, జీవో 123ని రద్దు చేసి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారమివ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఈ దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంటే ప్రభుత్వం వారి పొట్టలు కొట్టే పనులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ముంపు గ్రామాలను సందర్శించే నేతలను అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం, పోలీసుల జులుంతో నిర్వాసిత గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు.