: కుటుంబ సభ్యులకు నయీమ్ డెడ్ బాడీ అప్పగింత!... షాద్ నగర్ నుంచి భువనగిరికి తరలింపు!


గ్రేహౌండ్స్ పోలీసుల బుల్లెట్లకు ప్రాణాలు వదిలిన తెలంగాణ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ మృతదేహం ఎట్టకేలకు అతడి కుటుంబ సభ్యులకు చేరింది. నల్లగొండ జిల్లాలోని అతడి సొంతూరు నుంచి నేటి ఉదయం నలుగురు బంధువులు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. నయీమ్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని వారు పోలీసులను కోరారు. ఈ క్రమంలో నిన్ననే పోస్టు మార్టం పూర్తయిన నయీమ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంపై గంటల తరబడి సమాలోచనలు చేసిన పోలీసులు ఎట్టకేలకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం నయీమ్ డెడ్ బాడీని అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఆ వెంటనే మృతదేహంతో నయీమ్ కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం భువనగిరి బయలుదేరి వెళ్లారు. భువనగిరిలోనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అతడి బంధువులు తెలిపారు.

  • Loading...

More Telugu News