: మునికోటి కుటుంబానికి జనసేన బాసట!... రూ.5 లక్షలు అందించనున్న పార్టీ నేత!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం గతంలో ఉద్యమం ఎగసిపడిన సమయంలో తిరుపతిలో పెట్రోల్ పోసుకుని మునికోటి అనే యువకుడు ఆత్మ బలిదానం చేసిన ఘటనకు నిన్నటితో ఏడాది నిండింది. ఈ క్రమంలో మునికోటి కుటుంబాన్ని ఆదుకునేందుకు జనసేన అదినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు. మునికోటి కుటుంబానికి రూ.5 లక్షల మేర ఆర్థిక సామాన్ని అందించాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ఆయన జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్యకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడో, రేపో తిరుపతి వెళ్లనున్న రాఘవయ్య సదరు మొత్తాన్ని మునికోటి కుటుంబానికి అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News