: జలకళతో శ్రీశైలం రిజర్వాయర్!... 862.4 అడుగులకు చేరిన నీటి మట్టం!


కృష్ణా నదిపై కర్నూలు జిల్లాలో శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్ జలకళతో కనువిందు చేస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్ కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటికే జలాశయంలో 100 టీఎంసీల మేర చేరిన నీరు... నేటి మధ్యాహ్నం 12 గంటల సమయానికి 113.48 టీఎంసీలకు చేరింది. వెరసి జలాశయంలో నీటి మట్టం 862.4 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... మరో రెండు రోజుల్లో ఈ స్థాయి నీరు జలాశయంలోకి చేరే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News