: జీవో 123 రద్దు నిలిపివేత!... టీ సర్కారుకు ఊరటనిచ్చేలా హైకోర్టు తీర్పు!
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణలో పెను సమస్యలు ఎదుర్కొంటున్న తెలంగాణ సర్కారుకు కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో కాస్తంత ఊరట లభించింది. ప్రాజెక్టులకు భూసేకరణ విషయానికి సంబంధించి అమల్లో ఉన్న జీవో 123ని రద్దు చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పుతో కేసీఆర్ సర్కారుకు భారీ ఊరట లభించినట్టేనన్న వాదన వినిపిస్తోంది.