: 'ap7am.com' జర్నలిస్ట్ తంగిరాల శ్రీరామచంద్రమూర్తి కన్నుమూత


పలు దినపత్రికల్లో వివిధ స్థాయుల్లో పనిచేసి, ప్రస్తుతం 'ap7am.com'లో కంటెంట్ రైటర్ గా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ తంగిరాల శ్రీరామచంద్రమూర్తి నిన్న ఉదయం హైదరాబాదు, సీతాఫల్ మండిలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో 'బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం'ను పూర్తి చేసిన ఆయన, 1974లో 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' లో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, డక్కన్ క్రానికల్ తదితర పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం 1995లో 'ఈనాడు' గ్రూపుకు సంబంధించిన 'న్యూస్ టైమ్'లో చేరారు. 2004లో పదవీ విరమణ చేశారు. ఆపై కూడా తన ప్రవృత్తిని వదిలివేయలేక పలు న్యూస్, యాడ్ ఏజన్సీలతో కలసి పనిచేశారు. ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం జరుగనున్నాయి. మూర్తి కుమారుడు విదేశాల నుంచి రావాల్సి వుంది. శ్రీరామచంద్రమూర్తి మరణం పట్ల శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు 'ap7am.com' ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

  • Loading...

More Telugu News