: జ్యోతిలక్ష్మి ఇకలేరు!... అనారోగ్యంతో కన్నుమూసిన టాలీవుడ్ నటి!
తెలుగు సినీ ప్రేక్షకులనే కాకుండా యావత్తు దక్షిణ భారతాన్ని తన స్టెప్పులతో అదరగొట్టిన టాలీవుడ్ సీనియర్ నటి జ్యోతిలక్ష్మి ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న ఆమె కొద్దిసేపటి క్రితం తమిళనాడు రాజధాని చెన్నైలో తుది శ్వాస విడిచారు. దాదాపు 300కు పైగా చలన చిత్రాల్లో నటించిన జ్యోతిలక్ష్మి... ప్రస్తుతం మనం పిలుచుకుంటున్న ఐటెం సాంగులతో కుర్రకారును హుషారెత్తించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లోనే కాకుండా హిందీ చలన చిత్రరంగం బాలీవుడ్ లోనూ ఆమె పలు చిత్రాల్లో నటించారు.