: విశాఖలో నేడు చంద్రబాబు టూర్!... దత్తత గ్రామంలో పర్యటించనున్న ఏపీ సీఎం!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు సాగర నగరం విశాఖపట్నం వెళ్లనున్నారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా ఆ జిల్లాలో తాను దత్తత తీసుకున్న గ్రామం పెదలపూడిలో చంద్రబాబు పర్యటిస్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన అదే జిల్లాలోని సుందర ప్రదేశం అరకు వెళతారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

  • Loading...

More Telugu News