: జగన్‌కు షాకిచ్చిన రాష్ట్రపతి.. చంద్రబాబు మంచి సీఎం అంటూ కితాబు!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, జీఎస్టీ బిల్లు వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం.. తదితర విషయాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నవించేందుకు వెళ్లిన ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రపతి షాకిచ్చారు. పెద్దాయనకు ఫిర్యాదు చేసి కాస్త ఊరట పొందాలని భావించిన జగన్‌కు అది దొరకలేదు సరికదా మరింత ఆవేదన మిగిలింది. జగన్ బృందం సోమవారం ఢిల్లీలో ప్రణబ్‌ను కలిసింది. పనిలోపనిగా చంద్రబాబుపై జగన్ ఫిర్యాదు చేశారు. దీంతో మధ్యలోనే కల్పించుకున్న రాష్ట్రపతి ‘‘చంద్రబాబు బాగానే చేస్తున్నారుగా. ఇలాంటి ముఖ్యమంత్రి మీకు ఎక్కడ దొరుకుతారు?’’ అంటూ బాబును ప్రశంసించినట్టు తెలిసింది. దీంతో అవాక్కవడం జగన్ వంతైంది. రాష్ట్రపతి వ్యాఖ్యలతో కంగుతిన్న జగన్ బృందం బాబుపై ఫిర్యాదులకు అక్కడితో పుల్‌స్టాప్ పెట్టినట్టు సమాచారం. ఏదో ఆశించి వెళ్తే ఇంకేదో అయిందని స్వయంగా వైసీపీ ఎంపీలే పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలతో తమ ఆవేదన వ్యక్తం చేశారట.