: లిక్కర్ మాఫియా డాన్... బొత్స : మంత్రి దేవినేని


వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణపై ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ‘లిక్కర్ మాఫియా డాన్ బొత్స’ అంటూ ఆయన్ని తూర్పారబట్టారు. జాతిపిత మహాత్మాగాంధీ గురించి బొత్స మాట్లాడటం సిగ్గు చేటని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆరోపణలు వస్తుంటాయి తప్పదు కనుక భరిస్తున్నామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై వైఎస్సార్సీపీ ఎన్ని కుట్రలు పన్నినా తాము వాటన్నింటినీ అధిగమించామని చెప్పారు. మరో రెండు రోజుల్లో గండి పూడ్చివేత పనులు పూర్తవుతాయన్నారు.

  • Loading...

More Telugu News