: మత సామరస్యాన్ని దెబ్బతీసే వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి: ఆరెస్సెస్
దేశంలో కలకలం రేపుతున్న ‘దళితులపై దాడులు’ అంశంపై ఆరెస్సెస్ మరోసారి స్పందించింది. దళితులపై దాడులను ఖండిస్తూ ఇటువంటి చర్యలు అమానవీయమని పేర్కొంది. దోషులను కఠినంగా శిక్షించాలని ఢిల్లీలో ఆరెస్సెస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి డిమాండ్ చేశారు. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే వారిపై రాష్ట్రప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని దళితులపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. మతానికి చెడ్డపేరు తేవాలనుకుంటున్న వారిపై జాగ్రత్త వహించాలని కోరారు.