: ఏపీలో ఒప్పంద, పొరుగుసేవ ఉద్యోగులకు శుభవార్త
ఏపీలో ఒప్పంద, పొరుగుసేవ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉద్యోగులు రూ.17500, డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్లకు రూ.15 వేలు, వాచ్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్‌లకు రూ.12 వేలు వేతనం అందుకోనున్నారు. ఈ నెల 1 నుంచే వేతనాలు అమలులోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.