: నయీం మృతదేహానికి పంచనామా
గ్రేహౌండ్స్ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం మృతదేహానికి పంచనామా నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ తహశీల్దార్ చందర్ రావు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం నయీం మృతదేహాన్ని షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలిస్తారు. కాగా, ఐపీఎస్ అధికారి వ్యాస్, బెల్లి లలిత, మాజీ నక్సల్స్ సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నయీం ప్రధాన నిందితుడు. పలు భూ దందాలు, సెటిల్ మెంట్లు చేసిన నయీంపై 58కి పైగా హత్య కేసులు, 100కి పైగా కేసులు ఉన్నాయి.