: అమెరికాలో చేదు అనుభవం వెనుక ఖుర్షీద్ హస్తం: యూపీ మంత్రి


గత బుధవారం అమెరికాలో చేదు అనుభవం చవిచూసిన ఉత్తరప్రదేశ్ మంత్రి అజామ్ ఖాన్ నేడు సంచలన ఆరోపణలు చేశారు. తనకు బోస్టన్ విమానాశ్రయంలో అక్కడి అధికారుల నుంచి ఎదురైన అవమానం వెనుక భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హస్తముందని అజామ్ ఖాన్ అంటున్నారు. దేశం వెలుపల తనను అప్రదిష్ట పాలు చేయడమే ఖుర్షీద్ లక్ష్యమని కూడా యూపీ మంత్రి చెప్పారు. ప్రస్తుతం యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ సహా అజామ్ ఖాన్ అమెరికాలోనే ఉన్నారు. రేపు వీరిద్దరూ భారత్ తిరిగివస్తారు.

కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తమ అభిప్రాయం విన్న తరువాత యూపీఏలో కొనసాగే విషయమై నిర్ణయం తీసుకుంటారని అజామ్ ఖాన్ పేర్కొన్నారు. తాను భారత్ లో శక్తిమంతమైన కాంగ్రెసేతర ముస్లిం నేతగా ఎదగడం చూడలేకే ఖుర్షీద్ చాలా తెలివిగా కుట్రకు తెరదీశాడని అజామ్ ఖాన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News