: నయీమ్ నే కాదు, అతని అనుచరులను కూడా హతమార్చాలి: సాంబశివుడు తండ్రి చంద్రయ్య
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీంనే కాదు, అతని అనుచరులను కూడా సమూలంగా అంతమొందించాలని మాజీ మావోయిస్టు నేత, టీఆర్ఎస్ నాయకుడు సాంబశివుడు తండ్రి చంద్రయ్య అన్నారు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తన కొడుకు సాంబశివుడిని నయీం హతమార్చిన నాటి సంఘటనను ఆయన ప్రస్తావించారు. ఎంతో మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న నయీం, అతని అనుచరులకు బతికే హక్కు లేదని అన్నారు. నయీం అనుచరులు కూడా హతం కావాలని తాను కోరుకుంటున్నానని చంద్రయ్య పేర్కొన్నారు.