: వరసగా మరోచోట.. రంగారెడ్డి జిల్లా పుప్పాల‌గూడ అల్కాపురి టౌన్‌షిప్‌లో ఓ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు


మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా మారిన నయీమ్ ఈరోజు ఉద‌యం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో హ‌త‌మ‌యిన విష‌యం తెలిసిందే. ప‌క్కా స‌మాచారంతో షాద్‌న‌గ‌ర్‌కి చేరుకున్న పోలీసులు న‌యీమ్‌ని చుట్టుముట్టి ఎన్‌కౌంట‌ర్ చేశారు. అయితే, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా పుప్పాల‌గూడ అల్కాపురి టౌన్‌షిప్‌లో పోలీసులు ఓ ఇంటిని కూడా చుట్టుముట్టారు. న‌యీం బంధువుకి చెందిన వారు ఆ ఇంట్లో ఉంటున్నారనే స‌మాచారంతో శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వ‌ర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News