: ఢిల్లీ చేరిన వైఎస్ జగన్!... మూడు రోజుల పాటు హస్తినలోనే మకాం!
వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అడుగు పెట్టారు. హైదరాబాదు నుంచి నేటి ఉదయం ఫ్లైటెక్కిన జగన్... కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ల్యాండయ్యారు. తొలుత నేడు, రేపు మాత్రమే ఆయన ఢిల్లీలో ఉంటారని వార్తలు వినిపించగా, తాజా సమాచారం ప్రకారం నేడు, రేపు, ఎల్లుండి (మూడు రోజులు) ఆయన ఢిల్లీలోనే ఉంటారట. ఈ సాయంత్రం ఆయన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసమే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.