: నయీమ్ డెడ్ బాడీ పక్కనే మహిళ మృతదేహం!... ’ఉగ్ర’ లింకులపైనా అనుమానాలు!


పాలమూరు జిల్లా షాద్ నగర్ లో నేటి ఉదయం జరిగిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ పెను కలకలమే రేపుతోంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలోని భయానక దృశ్యాలన్నీ తెలుగు టీవీ ఛానెళ్లలో లైవ్ గా ప్రసారమవుతున్నాయి. తాను తలదాచుకున్న భవనానికి కాస్తంత దూరంలో రోడ్డు పక్కగా, చెట్ల సమీపంలో నిర్జీవంగా పడి ఉన్న నయీమ్ పక్కనే ఓ మహిళ చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. సదరు మహిళ ఎవరన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే... గ్యాంగ్ స్టర్ గా పేరుగాంచిన నయీమ్ తాజాగా ఉగ్రవాదులతోనూ లింకులు పెట్టుకున్నాడన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఉగ్రవాదులతో భేటీ కోసమే అతడు నిన్న రాత్రి 7 గంటల సమయంలో షాద్ నగర్ కు వచ్చాడు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నయీమ్ చనిపోయాడు. అదే సమయంలో అతడితో పాటు పారిపోయేందుకు యత్నించిన సదరు మహిళ కూడా చనిపోయి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. అయితే నయీమ్ డెడ్ బాడీ పక్కన నిర్జీవంగా పడి ఉన్న మహిళ ఎవరన్న విషయం తెలియరాలేదు.

  • Loading...

More Telugu News