: పారిపోతూ తూటాలకు బలైన నయీమ్... రోడ్డు పక్కగా చెట్ల వద్ద పడిపోయిన మృతదేహం
పాలమూరు జిల్లా షాద్ నగర్ లో నేటి ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైన నయీమ్ తప్పించుకునేందుకు విశ్వయత్నం చేసినట్లు తెలుస్తోంది. నయీమ్ తలదాచుకున్న భవనంలో కాకుండా సదరు భవనానికి కాస్తంత దూరంలో రోడ్డు పక్కగా, చెట్లకు సమీపంలో పడి ఉన్న అతడి మృతదేహానికి సంబంధించిన దృశ్యాలు టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతున్నాయి. పోలీసుల అలికిడిని గమనించిన నయీమ్ అక్కడి నుంచి పారిపోయే క్రమంలోనే పోలీసుల తూటాలకు హతమై ఉంటాడన్న భావన వ్యక్తమవుతోంది. రోడ్డు పక్కగా చెట్ల సమీపంలో నిర్జీవంగా పడి ఉన్న నయీమ్ మృతదేహం వద్ద పోలీసులు కాపలాగా ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.