: పుష్కర ఘాట్ల వద్ద మంత్రులతో బోయపాటి శ్రీను సందడి!


కృష్ణా పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి హారతి ఇచ్చే ఏర్పాట్లు ఎలా ఉండాలన్న విషయమై దర్శకుడు బోయపాటి శ్రీను నేడు మంత్రులతో కలసి సమీక్షించారు. ఫెర్రీ పుష్కర ఘాట్ కు వచ్చిన ఆయన, హారతిపై సూచనలు చేశారు. హారతి ఎలా ఉండాలి? యాత్రికులకు అందరికీ కనిపించేందుకు ఎంత ఎత్తులో వేదిక ఉండాలన్న విషయమై విశ్లేషించి, తన ఆలోచనలను మంత్రులు నారాయణ, దేవినేని ఉమలకు వివరించారు. కాగా, పుష్కర హారతి కార్యక్రమం అటు విజయవాడ దుర్గా ఘాట్ వద్ద, గోదావరి, కృష్ణమ్మలు సంగమించే ఫెర్రీ ఘాట్ వద్ద జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏర్పాట్లు బోయపాటి మార్గనిర్దేశంలో సాగుతాయి. ఇక ఘాట్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని చెప్పిన దేవినేని ఉమ, భక్తులు సులువుగా ఘాట్లకు వెళ్లేలా చూస్తామని, ఇబ్బందులు పడనీయకుండా చూడటమే తమ ఉద్దేశమని వెల్లడించారు. ఎలాంటి దుర్ఘటనలూ జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News