: నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ... మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రికి గాయాలు


నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమనగా, ఓ వర్గం వారు జరిపిన దాడిలో మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రికి స్వల్ప గాయాలు అయ్యాయి. రామన్నపేట మండలం ఇంద్రపాల నగరంలో జరిగిన ఈ దాడికి పాత వివాదాలే కారణమని భావిస్తున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక వర్గం వారు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు శ్రీధర్ రెడ్డి, గున్నారెడ్డి తదితరులపై దాడికి దిగడంతో వారందరికీ తీవ్రంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారందరికీ ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ప్రకాష్, ఇంద్రపాల నగరం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికప్పుడు అదనపు పోలీసు బలగాలను తరలించి గ్రామంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలియజేశారు.

  • Loading...

More Telugu News