: మోదీ పర్యటన ఎపెక్ట్!... జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని ఎంపీలకు టీఆర్ఎస్ ఆదేశం!


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న తెలంగాణలో జరిపిన పర్యటన మంచి ఫలితాన్నే ఇచ్చినట్లుంది. నేడు లోక్ సభ ముందుకు రానున్న జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ తన ఎంపీలకు ఆదేశాలు జారీ చేసింది. జీఎస్టీ బిల్లుపై ఓటింగ్ జరగనున్నందున నేడు పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని టీఆర్ఎస్ తన ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నిన్న మోదీ పర్యటన ముగిసిన మరుక్షణం టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి ఆ పార్టీ ఎంపీలకు కీలక సమాచారం చేరిపోయింది. మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని ఆ సమాచారంలో టీఆర్ఎస్ తన ఎంపీలకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News