: యూపీలో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి పది మంది భక్తుల దుర్మరణం


ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ తిరగబడి పదిమందులు భక్తులు మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. దైవ కార్యక్రమంలో పాల్గొనేందుకు 40 మంది భక్తులు ట్రాక్టర్‌లో షహజ్వా ప్రాంతం నుంచి సుల్తాన్‌పూర్ వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పదిమంది అక్కడికక్కడే మృతి చెందగా మిగతా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ పవన్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ) ప్రదీప్ కుమార్ యాదవ్ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అన్ని విధాలా వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News