: కన్నడ నాట ‘సింగిల్ నెంబర్ లాటరీ’ కలకలం!... ఒకే రోజు 35 మంది ఐపీఎస్ లకు సీబీఐ నోటీసులు!


కర్ణాటకలో ఇటీవల వెలుగుచూసిన సింగిల్ నెంబర్ లాటరీ కుంభకోణం... ఆ రాష్ట్రంలో పెను కలకలానికే తెర తీసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కుంభకోణంతో ప్రమేయముందంటూ ఆ రాష్ట్రంలోని 35 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీ ఓంప్రకాశ్, హోంశాఖ మంత్రి సలహాదారు కెంపయ్యలను ఢిల్లీలోని తన కార్యాలయానికి పిలిపించిన సీబీఐ వారిని విచారించింది. తాజాగా ఒకే రోజు 35 మంది ఐపీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసిన సీబీఐ... ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ కూడా విడిచిపెట్టేది లేదని సంకేతాలనిచ్చింది. అక్రమాలపై దర్యాప్తు చేయాల్సిన ఐపీఎస్ అధికారులకే సీబీఐ నోటీసులు జారీ అయిన విషయం ఒక్క కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ పెద్ద చర్చనీయాంశమే అయ్యింది.

  • Loading...

More Telugu News