: సలసల కాగే వేడి నూనె లోంచి ఒట్టి చేతులతో వడలు తీసి మొక్కు తీర్చుకున్న భక్తుడు
సలసల కాగే వేడి నూనెలో ఉన్న వడలను ఒట్టి చేతులతో తీసి ఓ భక్తుడు తన మొక్కు చెల్లించుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూర్ బిల్లాలితొట్టి గ్రామంలోని ముత్తుమారి యమ్మన ఆలయ ఉత్సవాల్లో కనిపించింది. ఆరు రోజుల నుంచి ఆలయంలో 'ఆడి' ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయంలో ప్రతి రోజు అభిషేకం, ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఓ భక్తుడు తన మొక్కును తీర్చుకున్నాడు. భక్తులందరూ అమ్మవారి నామాలను పఠిస్తూ ఉండగా వేడి నూనెలో నుంచి ఒట్టిచేతులతో వడలు తీశాడు. అనంతరం వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాడు.