: హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగించిన కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అనంతరం మెదక్ జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హిందీలో తన ప్రసంగం చేశారు. కృష్ణా, గోదావరి నీటిని ఇంటింటికీ చేర్చాలనేదే మిషన్ భగీరథ లక్ష్యం అని ఆయన అన్నారు. తెలంగాణకు ఈరోజు శుభదినం అని ఆయన అన్నారు. వాటర్‌గ్రిడ్‌తో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు అందించనున్నామని ఆయన తెలిపారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేరైల్ కల ఇన్నాళ్లకు సాకారమైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం మంచి సాయాన్ని అందిస్తోందని ఆయన అన్నారు.