: బహిరంగ సభకు వ్యాఖ్యాతగా హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం మెదక్ జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వ్యాఖ్యాతగా తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యవహరించారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులను ఆయన వేదికపైకి ఆహ్వానించి, కేంద్రమంత్రి దత్తాత్రేయను ప్రారంభోపన్యాసం చేయాల్సిందిగా కోరారు. మోదీని అభివృద్ధికి చిహ్నంగా దత్తాత్రేయ అభివర్ణించారు.