: మోదీకి తిలకం దిద్ది ఆహ్వానించిన వేద పండితులు.. మిషన్ భగీరథ తొలిదశను ప్రారంభించిన ప్రధాని
ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథను ప్రారంభించడానికి మెదక్ జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండకు చేరుకున్న ప్రధాని మోదీకి వేద పండితులు తిలకం దిద్ది ఆహ్వానం పలికారు. అనంతరం మోదీ మిషన్ భగీరథ తొలిదశను ప్రారంభించి, పైలాన్ ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయతో కలిసి మోదీ.. మిషన్ భగీరథ ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. వాటర్ గ్రిడ్ పనితీరును మోదీకి కేసీఆర్ వివరించారు.