: ఒకే విమానంలో కోమటిబండ బయలుదేరిన మోదీ, కేసీఆర్
భారత వాయు సేన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలిసి ఒకే విమానంలో మెదక్ జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండకు బయలుదేరారు. అక్కడ ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేబట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో బీజేపీ నిర్వహించనున్న మహాసమ్మేళన్‌లో పాల్గొంటారు.