: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీ.. ఘనస్వాగతం పలికిన కేంద్రమంత్రులు, నరసింహన్, కేసీఆర్
ప్రధాని హోదాలో తొలిసారి నరేంద్రమోదీ తెలంగాణకు చేరుకున్నారు. భారత వాయు సేన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్రాత్రేయతో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు పద్మారావు, తలసాని, బీజేపీ రాష్ట్ర నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మోదీకి ఘనస్వాగం పలికారు. మోదీ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో ఏర్పాట్లు చేసింది. ఆయన మరికాసేపట్లో కోమటిబండకు బయలుదేరనున్నారు.