: కోర్టు నుంచి బయటికొచ్చే సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న అమలాపాల్


వివాహం జ‌రిగిన ఏడాదికే మనస్పర్థల కారణంగా గతేడాది మార్చి 3 నుంచి వేరుగా ఉంటున్న నటి అమలా పాల్, దర్శకుడు విజయ్ ఆనంద్ ఇక త‌మ వివాహ బంధానికి బై చెప్పుకోవాలని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. విడాకుల కోసం నిన్న వారు ఇరువురూ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి న్యాయమూర్తి ముందు హాజ‌రై, తమకు విడాకులు మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, కోర్టులో ఈ తంతు ముగిసిన అనంత‌రం బ‌య‌ట‌కు వ‌స్తూ అమ‌లాపాల్ క‌న్నీళ్లు పెట్టుకుంది. భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూనే అక్క‌డి నుంచి వెళ్లిన‌ట్లు స‌మాచారం. విడాకులు తీసుకుంటున్న సంద‌ర్భంగా ఆమె భర్త నుంచి భరణం లాంటిదేమీ కోర‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News