: కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, సురేష్ షట్కార్ అరెస్ట్
భారత ప్రధాని నరేంద్ర మోదీ కోమటిబండ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణఖేడ్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీ సురేష్ షట్కార్ ను, సంగారెడ్డి నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శశిధర్ రెడ్డిలను మెదక్ లో పోలీసులు అరెస్ట్ చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా సంగారెడ్డి నుంచి ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలను, సిద్దిపేటలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు. సాయంత్రం 6 గంటల తరువాత మాత్రమే విడిచి పెడతామని పోలీసు వర్గాలు స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.